ఒప్పందం కుదుర్చుకున్న టాలీవుడ్లోని బడా మూవీస్..?

August 26, 2021 at 8:41 am

నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ ఈ సినిమాను సెప్టెంబర్ 10న అమెజాన్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.ఎన్నోసార్లు ఆటంకాల మధ్య ఈ సినిమా విడుదల కాబోతోంది.సెప్టెంబర్ 10న థియేటర్ లో నాగచైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా విడుదల కానుంది.అదే రోజు ఓటిటి లో టక్ జగదీష్ సినిమా విడుదల అవుతుండటంతో ఎలా విడుదల చేస్తారు అని సునీల్ నారంగ్ ఫైర్ అయ్యారు. ఇలా చేయడం వల్ల హీరో నాని పై థియేటర్ల సంఘం వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం జరిగింది.

 

తాజా సమాచారం ప్రకారం టక్ జగదీష్, నితిన్ మూవీ మ్యాస్ట్రో ,లవ్ స్టోరీ ఇలా మూడు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.అంతేకాకుండా ఈ మూడు సినిమాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.లవ్ స్టోరీ సినిమాను డైరెక్టర్ శేఖర్ కమలా చెప్పినట్లే సెప్టెంబర్ 10న థియేటర్లో విడుదల అవ్వబోతుందట.

సెప్టెంబర్ 9న నితిన్..మ్యాస్ట్రో మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావాల్సిన ఉంది.మ్యాస్ట్రో’సినిమాను మరి కొద్దిగా ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 10న టక్ జగదీష్ అమెజాన్ లో విడుదల కావాల్సిన మూవీని ఇంకొక వారం పోస్ట్ ఫోన్ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

ఈ డీల్స్ కేవలం నిర్మాతల మధ్య జరిగింది.దానికి స్ట్రీమింగ్ కంపెనీల వారు ఒప్పుకోవాల్సి ఉంది.స్ట్రీమింగ్ సైట్స్ నిర్మాతలు ఒప్పుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ వారిని రిక్వెస్ట్ చేసుకుంటే ఏమైనా అవకాశం ఉంటుంది.అంతే కాకుండా నితిన్ నటించిన మాస్ట్రో మూవీకి ఇ ఒప్పందంని ఆ ఓటిటీ ఛానల్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.మరి టక్ జగదీష్ సినిమాకు సంబంధించి ఆ సంస్థ ఒప్పుకుంటుందా లేదా వేచి చూడాల్సిందే.

ఒప్పందం కుదుర్చుకున్న టాలీవుడ్లోని బడా మూవీస్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts