ఆక‌ట్టుకుంటున్న `పుష్ప‌` ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై పాన్‌ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్ `దాక్కో దాక్కో మేక..` ను ఆగ‌స్టు 13న మొత్తం ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆ సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ఆక‌ట్టుకుంటున్న ఈ ప్రోమోలో బ‌న్నీ క‌త్తిని నోట్లో పెట్టుకుని ఊగిపోతూ క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ ప్రోమో చూసిన త‌ర్వాత ఫ‌స్ట్ సింగిల్‌పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగి పోయాయి. కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. అలాగే ఫహద్‌ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు.

Share post:

Latest