మ‌హేష్ బాబుకు మెగాస్టార్ స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌..ట్వీట్ వైర‌ల్‌!

న‌వ మ‌న్మ‌థుడు, అమ్మాయిల‌ క‌ల‌ల రాకుమారుడు, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా అభిమానులే కాకుండా సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా మ‌హేష్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మ‌హేష్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు.

`హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి` అంటూ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. దాంతో చిరు ట్వీట్ వైల‌ర్‌గా మారింది.

ఇక మ‌రోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. `నాకు తెలిసిన నైసెస్ట్ సూప‌ర్ స్టార్, ఎప్ప‌టికి యువ‌కుడిగా క‌నిపించే మ‌హేష్ బాబుకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జ‌రుపుకోవాలి బ్ర‌ద‌ర్ ` అంటూ ట్వీట్ చేశారు.

 

Share post:

Popular