చిరంజీవి, బాబి సినిమాకు మారిన టైటిల్‌..త్వ‌ర‌లోనే..?

మెగా స్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్ట‌ర్ బాబి కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించనుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే..త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

- Advertisement -

Chiranjeevi postpones 'Lucifer' remake to make way for 'Vedalam' remake | The News Minute

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమాకు మొద‌ట అన్న‌య్య అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్టు టాక్ న‌డిచింది. ఇక మొన్నీ మ‌ధ్య వాల్తేరు వీరయ్య అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు వార్త‌లు రాగా.. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మ‌ళ్లీ మారింది.

Mega 154: Pre-look poster of Chiranjeevi's next with director Bobby released | Telugu Movie News - Times of India

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీకి `వాల్తేరు శీను` అనే టైటిల్‌ను లాక్ చేశార‌ట‌. అంతేకాదు, త్వ‌ర‌లోనే ఈ సినిమా మేక‌ర్స్ టైటిల్‌ను అధికారికంగా ప్ర‌కటించ‌నున్నార‌ని కూడా తెలుస్తోంది. కాగా, పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతోన్న ఈ మూవీలో చిరంజీవి ఫుల్ మాస్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు.

Share post:

Popular