చిరు బ‌ర్త్‌డే..సూప‌ర్ ట్రీట్ ప్లాన్ చేసిన మెహ‌ర్‌ ర‌మేష్‌!

రేపు(ఆగ‌ష్టు 22) టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు. మెగా అభిమానులంద‌రూ ఆ రోజును పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, రక్త దానాలు, అన్నదానాలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అలాగే చిరు న‌టిస్తున్న సినిమాల నుంచి అదిరిపోయే అప్డేట్‌లు వ‌స్తుంటాయి. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి.. మ‌రోవైపు మోహ‌న్ రాజా డైరెక్ష‌న్‌లో లూసిఫ‌ర్ రీమేక్ ను కూడా స్టార్ట్ చేశాడు.

ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన‌ వెంట‌నే మెహ‌ర్ ర‌మేష్‌తో వేదాళం రీమేక్‌, బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఈ నేప‌థ్యంలోనే చిరు బ‌ర్త్‌డేకి ఆయ‌న న‌టిస్తున్న అన్ని చిత్రాల నుంచీ సాలిడ్ అప్డేట్స్ రానున్నాయి. ఇప్ప‌టికే మోహ‌న్ రాజా నేటి సాయంత్రం 5:04 నిమిషాలకు టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

అయితే తాజాగా ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ కూడా మెగా అభిమానుల కోసం సూప‌ర్ ట్రీట్ ప్లాన్ చేశాడు.ఇందులో భాగంగా రేపు ఉద‌యం 9గం.ల‌కు వేదాళం రీమేక్‌కు సంబంధించిన అప్డేట్ రానుంది. కొద్ది సేప‌టి క్రితమే రేపు ఉదయం తొమ్మిది గంటలకు మెగా ప్రభంజనం చూస్తారని నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. మ‌రి ఈ చిత్రం నుంచి ఏం అప్డేట్ రాబోతుందో తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular