మెగాస్టార్ సాయం లేకపోతే హేమ లేదు: రాజా రవీంద్ర

మెగాస్టార్ చిరంజీవి ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి ఎటువంటి అండాదండా లేకుండా వచ్చే రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడాడు.అలాగే కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తనవంతుగా సాయం చేశాడు. ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇదిలా ఉంటే నటుడు రాజా రవీంద్ర నటి హేమకు చిరంజీవి చేసిన గొప్ప సహాయం గురించి తెలిపారు.

నటి హేమ డెలివరీ సమయంలో ఆమెకు రక్తం కావాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే ఆమె బతికి బయటపడింది, లేకపోతే చనిపోయేది అంటూ తెలిపారు. ఆమెది ఓ నెగటివ్ బ్లడ్ అది చాలా అరుదుగా దొరుకుతుంది అని తెలిపారు. అయితే బ్లడ్ బ్యాంక్ ను మెయింటైన్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. దాని కోసం నెలకు కొన్ని లక్షలు ఖర్చు అవుతుందని రాజారవీంద్ర తెలిపారు. గతంలో హేమ తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆదుకుందని తెలిపింది.