భూమిక అంటే నాకు చాలా ఇష్టం.. ఐశ్వర్య రాజేష్

కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఆర్ ప్రసాద్ దర్శకత్వంలో  ప్రధాన పాత్రలో నటించిన భూమిక సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు పృథ్వి చంద్ర శేఖర్ సంగీతాన్ని అందించారు. అలాగే రాబర్ట్ ఛాయాగ్రహణం అందించారు. ఈ సినిమా పర్యావరణ పరిరక్షణ ప్రధాన అంశంగా ఎకో హారర్ థ్రిల్లర్ ఇతివృత్తం తో ఈ సినిమాను రూపొందించామని దర్శకుడు ఆర్ ప్రసాద్ తెలిపారు.

భూమిక సినిమా నాకు చాలా స్పెషల్ అని ఐశ్వర్య రాజేష్ తెలిపింది. అయితే ఈ సినిమాలో కథ కొంచెం కొత్తగా అనిపించడంతో ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను అంటూ తెలిపింది ఐశ్వర్య రాజేష్. అయితే ఐశ్వర్య రాజేష్ కు ఇది 25వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా 23వ తేదీ తమిళం తెలుగు భాషలలో నెట్ ఫ్లిక్స్ అలాగే ఓటిటి ప్లాట్ఫామ్ లలో స్ట్రీమింగ్ కావడంతోపాటు విజయ్ టీవీ లో ను కూడా ప్రసారం కావడం విశేషం.