ఇప్పుడు పద్ధతిగా కనిపించే గృహలక్ష్మి ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా?

కస్తూరి శంకర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు గృహలక్ష్మి సీరియల్ తులసి గా అందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా పలు సినిమాలు నటించి ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది నటి కస్తూరి శంకర్.గృహలక్ష్మి సీరియల్ లో అమాయకంగా తులసి పాత్రలో కనిపించే కస్తూరి తన అందం, అభినయం, నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఒకప్పుడు ఈమె అన్నమయ్య సినిమాలో నాగార్జున భార్య పాత్రలో నటించింది.అలాగే తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది. అంతేకాకుండా భారతీయుడు అనే సినిమాలో కూడా ఆమె నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గృహ లక్ష్మి సీరియల్ లో తెలుగింటి ఆడపడుచుల కనిపించే కస్తూరి సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Share post:

Latest