జిమ్‌లో సీఎం క‌స‌ర‌త్తులు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

గ‌త‌ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించడంతో తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ప్ర‌స్తుతం త‌న పాల‌న‌తో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ముద్ర‌ను వేయించుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్న స్టాలిన్‌.. మ‌రోవైపు ఆరోగ్యంపై కూడా ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే జిమ్‌లో చెమ‌ట‌లు చిందేలా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. తాజాగా స్టాలిన్ జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒక‌టి సోస‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. శారీరక దారుఢ్యం కోసం కాస్త కఠినమైన వర్కౌట్లు చేస్తూ స్టాలిన్ దర్శనమిచ్చారు.

కాగా, రాజ‌కీయాల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం రెగ్యుల‌ర్‌గా స్టాలిన్ కాస‌ర‌త్తులు చేస్తుంటారు. గ‌తంలోనూ స్టాలిన్ వ్యాయామాల‌కు సంబంధించిన‌ వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట సంద‌డి చేశాయి.

https://twitter.com/ibctamilmedia/status/1428999798368006144?s=20