డాక్టర్ అక్కడ తాకాడు..చేదు అనుభ‌వంపై చిన్మయి కామెంట్స్ వైర‌ల్‌!

ప్ర‌ముఖ సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉండే చిన్మయి.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆడ‌వారిపై జరుగుతున్న లైంగింక వేధింపుల‌కు వ్య‌తిరేఖంగా పోరాటం చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు మ‌హిళ‌లు తమకు జరిగిన అన్యాయాలు, వేధింపులు, అత్యాచార ఘటనలు చిన్మయికి చెబుతుంటారు. ఆమె వారికి త‌న‌దైన శైలిలో సలహాలు సూచన‌లు ఇస్తుంటుంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ మ‌హిళ త‌న‌కు ఎదురైన ఓ చేదు అనుభ‌వాన్ని చిన్మ‌యితో షేర్ చేసుకుంది. స‌ద‌రు మహిళ పిల్లలకు పాలు పట్టడంతో సమస్య వస్తుండటంతో.. తెలిసిన డాక్ట‌ర్ వ‌ద్ద‌కే వెళ్లింద‌ట‌. అయితే ఆ సమయంలో ఆ డాక్టర్ మాత్రం తన వక్షోజాలను పట్టుకునేవారని, అది ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్నారా? లేదా? అది వైద్యం కోసం చేస్తున్నారా? అన్నది నాకు అర్థం కావడం లేదు.. మీరు ఏదైనా సలహా ఇవ్వండి అని స‌ద‌రు మ‌హిళ‌ చిన్మయిని వేడుకుంది.

దాంతో చిన్మ‌యి స్పందిస్తూ.. సమస్య ఏదైనా సరే వైద్యుడు అలా ట‌చ్ చేయ‌కూడ‌దు. అలాగే మీ సమస్యకు పరీక్షించే విధానం కూడా అది కానే కాదు. ఆ డాక్ట‌ర్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఇక‌పై అత‌డి వ‌ద్దకు వెళ్ల‌కండి. మ‌రియు అత‌డిపై వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయండి అంటూ చెప్పుకొచ్చింది. దాంతో చిన్మ‌యి కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.