35 సంవత్సరాల వెంకీ సినీ కెరియర్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన.. సురేష్ ప్రొడక్షన్స్..!

August 16, 2021 at 1:18 pm

టాలీవుడ్ హీరోల్లో మన స్టార్ హీరో వెంకటేష్ గురించి చెప్పనవసరమే లేదు. ఎన్నో సినిమాల ద్వారా వెంకటేష్ ప్రజల ఆదరణ అభిమానాన్ని పొందాడు. అంతేకాకుండా, ఈమధ్య కాలంలో తీసిన సినిమాలలో నారప్ప సినిమా ఓటీటీ
లో విడుదలైంది. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా తొలి అడుగు వేసాడు. అంతేకాకుండా తనదైన ప్రతిభను చాటాడు. ఇక కొన్ని మాస్ చిత్రాల్లోనూ , కొన్ని ఎమోషనల్ చిత్రాలలోనూ , ఫ్యామిలీ మూవీస్ లోనూ ఇలా రకరకాల మూవీస్ లో నటించి, ప్రజల ఆదరణ అభిమానాన్ని పొందాడు.

అలా వెంకటేష్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, దాదాపుగా 35 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్ వారు వెంకటేష్ నటించిన మొదటి చిత్రం నుండి ఈ మధ్య కాలంలో నటించిన నారప్ప సినిమా వరకు ఒక స్పెషల్ వీడియో ను రిలీజ్ చేశారు.. ఇందులో తొలి సినిమా కలియుగ పాండవులు నుంచి నారప్ప వరకు వరుసగా ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఈ వీడియో వెంకటేష్ అభిమానులకు పెద్దవూరట నిస్తుందని, అంతేకాకుండా అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుందని భావిస్తున్నారు.

అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున హీరోలు వంటి వారు పెద్ద హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 35 ఏళ్ల సినిమా ప్రయాణంలో 70కి పైగా సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించాడు. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ పొందాలని అనుకుందాం.https://youtu.be/0993kn7AMek

35 సంవత్సరాల వెంకీ సినీ కెరియర్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన.. సురేష్ ప్రొడక్షన్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts