ప్ర‌ముఖ ఓటీటీలో దగ్గుబాటి హీరోల వెబ్ సిరీస్‌..త్వ‌ర‌లోనే..?

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు ఎక్క‌డ‌లేని క్రేజ్ వ‌చ్చేసింది. దాంతో కొత్త కొత్త ఓటీటీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇక మొన్నటిదాకా టీవీ షోలు, సినిమాల‌తోనే గ‌డిపిన ప్రేక్ష‌కులు.. ఓటీటీల రాకతో వెబ్ సిరీస్‌ల‌కు కూడా బాగా అల‌వాటు ప‌డిపోయారు. ఈ నేప‌థ్యంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌పై దృష్టి సారిస్తున్నారు.

ఈ లిస్ట్‌లో ద‌గ్గుబాటి హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ వెంకటేష్, రానాలతో ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతోంద‌ట‌. ఈ సిరీస్‌‌‌‌కు అద్భుతమైన కథ కూడా దొరికింద‌ని.. త‌ర్వాత అన్ని వివ‌రాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ సిరీస్ కోసం వెంక‌టేష్ కంటే ఎక్కువ‌గా రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్నాడ‌ట రానా. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. రానా న‌టించిన విరాట‌ప‌ర్వం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మ‌రోవైపు నార‌ప్ప‌తో హిట్ అందుకున్న వెంకీ.. ప్ర‌స్తుతం ఎఫ్ 3లో న‌టిస్తున్నాడు. మ‌రియు ఈయ‌న న‌టించిన దృశ్యం త్వ‌ర‌లోనే రిలీజ్ కాబోతోంది.