సమయం ఆసన్నమైంది మిత్రమా.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకుందామా.. !

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి వర్గవర్గ విస్తరణ సమయంలో పలువురికి చోటు కల్పించారు. రెండున్నర సంవత్సరాల తరువాత కేబినెట్ మినిస్టర్స్ చేసిన పనిని బేరీజు వేసుకొని మార్పులు చేస్తానని అప్పుడే చెప్పాడు. ఇప్పుడు సమయం దగ్గరకు వచ్చింది. మరి టీమ్ లో ఎవరుంటారో.. ఎవరు బయటకు వెళతారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే జగన్ మదిలో ఉన్నది ఎవరికీ చెప్పడు అని సీఎంకు సన్నిహితంగా ఉన్నవారే చెబుతారు. దీంతో బెర్త్ కాపాడుకోవడానికి మంత్రులు.. చోటు సంపాదించడానికి బయటివారు జగన్ కు నచ్చేలా ప్రవర్తిస్తున్నారు.

ఎలాగైనా అధినేతను ప్రసన్నం చేసుకుంటే చాలు.. ఇక మంత్రి పదవి దానికదే వస్తుంది. అందుకే ప్రతిపక్ష పార్టీ నాయకులపై వైసీపీ నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నాయకులే లక్ష్యంగా ఎమ్మెల్యేలు మాటల తూటాలు పేల్చుతున్నారు.   ఈ పొగడ్తలు ఎలా ఉన్నాయంటే.. జగన్ సీఎంగా 30 సంవత్సరాలుంటారని ఒకరంటే.. ప్రధాన మంత్రి అవుతారని ఇంకొకరంటారు. మరి ఇది జగన్ కు ఇష్టమో.. లేదో తెలియదు కాని పొగడ్తల వర్షం మాత్రం కురుస్తూనే ఉంది. ఈ భజన మంత్రి వర్గ విస్తరణ వరకు కచ్చితంగా ఉంటుంది.. ఉండి తీరుతుంది అంతే.. !

Share post:

Popular