`ఆహా`లో విజయ్ సేతుపతి `విక్రమార్కుడు`..విడుద‌ల ఎప్పుడంటే?

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా.. ప్ర‌తి వారం కొంత కంటెంట్‌తో ముందుకు వ‌స్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను సూప‌ర్ ఎంట‌ర్టైన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఓవైపు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు అందిస్తూనే మరోవైపు అనువాద చిత్రాల‌తో అల‌రిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు మ‌రో సూప‌ర్ హిట్ మూవీని ప్రేక్ష‌కుల కోసం తీసుకురాబోతోంది.

2018లో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుపతి నటించిన జుంగా సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతుంది. తమిళ్ సక్సెస్ అయిన ఈ చిత్రాన్ని విక్రమార్కుడు పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. అయితే ఆహాలో ఈ చిత్రం జూలై 9న విడుద‌ల కాబోతోంది.

దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. కాగా, కాస్మోరా ఫేమ్ గోకుల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి మాఫియా డాన్ గా కనిపించనున్నాడు.

Share post:

Latest