డ‌బ్బు కోసం రాత్రుళ్లు అక్క‌డ ప‌ని చేసేవాడ్ని:విజ‌య్ సేతుప‌తి

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతూ విలక్షణ న‌టుడుగా పాన్ ఇండియా స్టాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈయ‌న‌.. త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

MasterChef Sun TV Show (2021): Watch All Episodes Online | Vijay Sethupathi  - News Bugz

తమిళ్ `మాస్టర్ చెఫ్` కు హోస్ట్ గా విజ‌య్ సేతుప‌తి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం స్టార్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తున్న విజ‌య్ సేతుప‌తి.. ఒక‌ప్పుడు చాలా క‌ష్టాల‌ను ఎదుర్కొన్నార‌ట‌. ముఖ్యంగా చెన్నైలో చదువుకుంటున్న రోజుల్లో.. సాయంత్రం 7గంటల నుంచి అర్థరాత్రి 12:30 గంటలవరకు ఫాస్ట్​ ఫుడ్ సెంటర్‌లో పనిచేసి.. అక్క‌డే భోజ‌నం చేసేవ‌డ‌ట‌.

Watch: Vijay Sethupathi looks festive in new promo from 'MasterChef Tamil'  | The News Minute

డబ్బులతో పాటు ఆకలి కూడా తీరుతుందనే కారణంతో రాత్రుళ్లు ఆ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లోనే చాలాకాలం పనిచేశార‌ట‌. దాంతో అక్క‌డ ప్ర‌తి నెలా రూ.750 జీతం వ‌చ్చేద‌ట‌. ఇక విజ‌య్‌కు వంట చేయ‌డ‌మంటే మ‌హా ఇష్ట‌మ‌ట. మ‌రియు సాయంత్రం వేళ వేడి వేడి ఉల్లి సమోసా తిన‌డానికి ఎంత‌గానో ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. కాగా, మాస్ట‌ర్ చెఫ్‌ షో ట్రైలర్‌ లాంఛ్‌ సందర్భంగా విజయ్‌సేతుపతి ఈ విషయాల‌న్నీ పంచుకున్నారు.

MasterChef Tamil' will make you think: Vijay Sethupathi - The Hindu