ఏంటీ..ప్ర‌భాస్ `స‌లార్‌`లో నాని హీరోయిన్ కూడా ఉందా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

After Arjun, Vani Kapoor to go on a virtual date | NewsTrack English 1

కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో శ్రుతిహాస‌న్‌తో పాటు మ‌రో హీరోయిన్ కూడా ఉంటుందట‌.

ఈ హీరో మరెవరో కాదు బాలీవుడ్ భామ వాణీ కపూర్. తాజా స‌మాచారం ప్ర‌కారం.. స‌లార్‌లో ఈమెను సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, వాణీ కపూర్ గతంలో నాని హీరోగా తెర‌కెక్కిన ఆహా కళ్యాణం చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా.. నాని, వాణీ క‌పూర్ ల‌ మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్కోట్ అయింది.

Share post:

Popular