`హ‌నుమాన్‌`కు తేజ సజ్జా షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌..ఎంతో తెలుసా?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో తేజ సజ్జా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాల‌న‌టుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ‌.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఇక తేజ రెండో చిత్రం ఇష్క్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. మూడో చిత్రం మ‌ళ్లీ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలోనే హ‌నుమాన్ చిత్రం చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. తెలుగులో సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తేజ డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు తేజ రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి గానూ.. తేజ ఏకంగా కోటి రూపాయల రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది. కాగా, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

Share post:

Latest