వామ్మో.. ఇప్పుడు రాజీనామా చేయాలా.. ఇదేంది బాసూ.. !

విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు చేస్తాం.. మరి మీరు అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు  ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి లేఖ రాయడం పార్టీలో కాకపుట్టిస్తోంది. ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగానే రాజీనామా ఏంటి అని ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. మేము చేయగలం.. మరి మీరు అని సీఎం జగన్ ను, ఆయన పార్టీని చంద్రబాబు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కుకు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని చెబుతున్నాడనంటే వైసీపీ పట్టిచుకోవడం లేదు.. జగన్ వదిలేశాడు అనే సంకేతం జనాల్లోకి తీసుకెళ్లాలనేది ఆయన ఉద్దేశం.

- Advertisement -

అయితే బాబు ఉద్దేశం ఏమైనా మేమెందుకు రాజీనామా చేస్తాం.. చేసినా ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామా.. !  అధికార పార్టీతో పోరాడగలమా అని సహచరులతో అంటున్నారు.  అయితే చంద్రబాబు మదిలో మాత్రం మరో ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ సభ్యులు రాజీనామా చేస్తే.. వీరితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు పదవులు త్యజిస్తే రాష్ట్రం మొత్తం ఎన్నికలు వస్తాయి.. అపుడు తాడో..పేడో తేల్చుకుందాం అన్నట్టుంది. వైసీపీ అధికారం చేపట్టి రెండేళ్లేగా అయిం.. వారు అంత ఈజీగా అధికారం వదులుకుంటారా ! ఈ విషయం రాజకీయాలను ఔపోసన పట్టిన నారావారికి తెలియదా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.

Share post:

Popular