మెగాహీరో కోసం మ‌రోసారి అలా చేయ‌డానికి సిద్ధ‌మైన త‌మ‌న్నా?!

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ‌ వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు టీవీ షోలు కూడా చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తుంది. అయితే ఈ అమ్మ‌డు గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. మెగా హీరో వ‌రుణ్ తేజ్ గ‌ని చిత్రంలో త‌మ‌న్నా కూడా మెర‌వ‌నుంద‌ట‌.

Varun Tej revealed his recent crush and more in an interesting Q&A | Telugu  Movie News - Times of India

బాక్సింగ్ నేప‌థ్యంలోనే తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌. అయితే ఈ చిత్రం సెకండాఫ్‌లో ఓ అదిరిపోయే స్పెష‌ల్ సాంగ్ ఉంటుంద‌ట‌. ఆ సాంగ్ కోసం త‌మ‌న్నాను సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే ఓకే చెప్పింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

It's final round for Varun Tej Ghani - tollywood

అంతేకాదు, ఈ ఒక్క సాంగ్ కోసం రెమ్మ్యూనరేషన్ కూడా త‌మన్నా భారీ రేంజ్‌లో ఛార్జ్ చేస్తుంద‌ని తెలుస్తోంది. కాగా, త‌మ‌న్నా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు శీను సినిమాలో స్పెషల్ సాంగ్‌‌‌‌లో మొదటిసారి కనిపించింది. ఆ త‌ర్వాత మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు, ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ చిత్రాల్లోనూ చిందులేసిన త‌మ‌న్నా.. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ కోసం మ‌రోసారి స్పెష‌ల్ సాంగ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది.

Share post:

Popular