కొత్త అవ‌తారం ఎత్తిన తాప్సీ..!

తాప్సీ పన్ను.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ‌.. కొన్నాళ్ల‌కే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది.

- Advertisement -

అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకూ కేరాఫ్ అడ్రస్‌గా మారిన తాప్సీ.. ఇప్పుడు కొత్త అవ‌తారం ఎత్తింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ‌.. నిర్మాత‌గా మారింది. అవుట్‌సైడర్‌ ఫిలింస్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది.

సూర్మా, పీకు వంటి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రంజల్‌ ఖాందియాతో కలిసి తన సంస్థ నుంచి సినిమాలు తీయనుంది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా తాప్సీ ప్ర‌క‌టించింది. అలాగే తప్పకుండా మంచి కంటెంట్‌తో ముందుకు వస్తానంటూ తెలిపింది.

Share post:

Popular