`ఎస్ ఆర్ కళ్యాణమండపం` ట్రైలర్ విడుద‌ల‌!

రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఎస్ ఆర్ కళ్యాణమండపం`. శ్రీధర్‌ గాదే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విల‌క్ష‌న న‌టుడు సాయి కుమార్ కీల‌క పాత్ర పోషించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 6న విడుద‌ల కానుంది.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ల‌వ్‌, కామెడీ, ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ ఇలా అన్ని అంశాలు క‌ల‌గ‌లిసిన చిత్ర‌మే ఎస్ ఆర్ కళ్యాణమండపం అని ట్రైల‌ర్ బ‌ట్టీ స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. అన్ని కోణాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ను కట్ చేశారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. కాగా, ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. అలాగే ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్‌, రాజు నిర్మించారు.

Share post:

Latest