నెట్టింట మ‌హేష్ క్రేజీ పిక్ వైర‌ల్‌!

July 28, 2021 at 11:40 am

ఫిట్ నెస్‌కు ప్రాధ‌న్య‌త ఇచ్చే హీరోల్లో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌రు. అందుకే నాలుగు పదుల వయసు దాటినా అబ్బురపరిచే ఫిట్‌నెస్‌తో సూప‌ర్‌గా హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటారాయన. ఇక ఇప్పటికే మహేష్ బాబుకు జిమ్ చేస్తున్న కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

Mahesh Babu Back From Vacation

అయితే తాజాగా మ‌హేష్ క‌స‌ర‌త్తులు చేస్తున్న ఓ క్రేజీ పిక్ నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఈ పిక్‌లో ఓ ట్రెయినర్ సమక్షంలో మహేష్ ఇర‌వై కేజీల డంబెల్స్‌‌‌ను లిఫ్ట్ చేస్తూ క‌నిపిస్తున్నాడు. ఇక ఈ ఫొటో చూసిన మ‌హేష్ అభిమానులు లైకులు, కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Mahesh Babu: అందంలోనే కాదు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌లోనూ సూపర్ స్టారే.. వైరల్ అవుతోన్న మహేష్ వర్కౌట్‌‌‌‌ ఫోటో.. - mahesh babu workout photo goes viral in social media

కాగా, మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఈ మూవీలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

 

నెట్టింట మ‌హేష్ క్రేజీ పిక్ వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts