కేటీఆర్ పై కీలక కామెంట్స్ చేసిన షర్మిల..?

మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల మాటల తూటాలు పేల్చింది. విలేకర్ల సమక్షంలోనే మంత్రిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. శుక్రవారం మీడియా మీట్ నిర్వహించిన ఆమెను కేటీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా..అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని విలేకరులకే రివర్స్ క్వశ్చన్ వేసింది. ఆమె పక్కన ఉన్న మరో నేత సీఎం కేసీఆర్ కొడుకు అని చెప్పగా నవ్వుకొని అనంతరం ప్రెస్‌మీట్ కొనసాగించింది.

‘మహిళలకు కేబినెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని.. కేటీఆర్ దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి..వ్రతాలు చేసుకోవాలి అంతేనా..అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..?’ అంటూ సూటిగా ప్రశ్నించారు షర్మిల. ‘నిరుద్యోగుల కోసం అన్నం మెతుకు ముట్టుకోకుండా మేం వ్రతం చేస్తున్నాం..తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తే మా వ్రతం ఫలించింది అనుకుంటాం..కేటీఆర్ మొగోడు అనుకుంటాం’ అని షర్మిల ఓ రేంజ్ లో స్పీచ్ ఇచ్చింది. మరి షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Share post:

Latest