కాజల్‌, స‌మంత‌ల‌కు ఊహించ‌ని షాకిచ్చిన రష్మిక‌..ఏమైందంటే?

కాజ‌ల్ అగర్వాల్‌, స‌మంత అక్కినేని.. వీరిద్ద‌రూ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు గ‌డిచాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన స‌మంత‌, కాజ‌ల్‌.. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. ఇక‌ సోష‌ల్ మీడియాలోనూ వీరిద్ద‌రికీ య‌మా క్రేజ్ ఉంది.

అలాంటి వీరికి ఈ మ‌ధ్యే వ‌చ్చిన క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఛ‌లో సినిమాతో 2018లో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని తెలుగు, క‌న్న‌డ‌, హిందీ మ‌రియు త‌మిళ సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. అంతేకాదు, మ‌రోవైపు క్యూట్ వీడియోలు, హాట్ ఫొటో షూట్ల‌తో సోష‌ల్ మీడియాలోనూ ఫాలోవ‌ర్స్‌ను పెంచుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవ‌ర్స్ విష‌యంలో ర‌ష్మిక‌.. కాజ‌ల్‌, స‌మంత‌ల‌ను దాటేసింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక ఫాలోవ‌ర్స్ సంఖ్య ఏకంగా 19.5 మిలియ‌న్ల‌కు చేరుకుంది. ఇక కాజ‌ల్‌కు ఇన్‌స్టాలో 19 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు, స‌మంత‌కు 17.6 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఏదేమైనా మొన్నీమ‌ధ్య వ‌చ్చిన ర‌ష్మిక‌.. ఎప్ప‌టినుంచో ఉన్న కాజ‌ల్‌, స‌మంత‌ల‌ను ఫాలోవ‌ర్స్ విష‌యంలో బీట్ చేయ‌డం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Share post:

Latest