రామ్‌ను లైన్‌లో పెట్టిన `క్రాక్‌` డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా క్రాక్ చిత్రాన్ని తెర‌కెక్కించి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు డైరెక్ట‌ర్‌ గోపీచంద్ మ‌లినేని. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ‌తో చేస్తున్నాడు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

- Advertisement -

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. గోపీచంద్ టాలీవుడ్ ఎన‌ర్జిటివ్ స్టార్ రామ్‌తో ఓ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. ఈ మధ్యే రామ్ కోసం ఓ మాస్ మసాలా క‌థను రెడీ చేసి.. ఆయ‌న‌కు వినిపించాడ‌ట‌. అది బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయ‌మ‌ని రామ్ చెప్పాడ‌ట‌.

ఇక అన్నీ అనుకున్న‌ట్టు కుదిరితే.. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం రామ్ లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇటు గోపీచంద్ బాల‌య్య‌తో సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్స్ పూర్తి అయిన త‌ర్వాత రామ్‌, గోపీచంద్ సినిమా ఉంటుంద‌ని టాక్‌. కాగా, గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో పండగ చేస్కో సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Share post:

Popular