మెగా వారుసుడిగా తెలుగు తెరకు పరిచయమై అనతి కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. తాను అపోలో ఆస్పత్రుల ఎండీ ప్రతాప్ రెడ్డి గారాల మనువరాలు ఉపాసనను పెళ్లాడాడు. ఈ రోజు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు కావడంతో మెగా అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
ఉపాసన పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఉపాసనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ… చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. చరణ్ ఈ పోస్ట్ లో రామ్ చరణ్ ఉపాసనను ఆకాశానికెత్తాడు. తన లాంటి భార్య దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఉపాసన మెగా కోడలిగానే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేసే మహిళగా అందరికీ సుపరిచితమే.. ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు.