వామ్మో.. నితిన్ `మాస్ట్రో`లో ఆ ఒక్క సాంగ్‌కే అంత ఖ‌ర్చైందా?

July 20, 2021 at 12:57 pm

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషించింది. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాదూన్ చిత్రానికి ఇది రీమేక్‌.

ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించిన వారందరిపై ఒక స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశార‌ట‌.

ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో చిత్రీకరించార‌ట‌. అయితే కేవలం ఈ ఒక్క సాంగ్ చిత్రీకరణ కోసమే ఏకంగా రూ. 50 లక్షలు ఖర్చు చేసినట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఈ సాంగ్‌ను ప్ర‌మోష‌న్స్ కోసం వాడ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

వామ్మో.. నితిన్ `మాస్ట్రో`లో ఆ ఒక్క సాంగ్‌కే అంత ఖ‌ర్చైందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts