హెల్ప్..హెల్ప్.. అంటూ ఏడుస్తున్న ర‌కుల్‌..మ్యాట‌ర్ ఏంటంటే?

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత క్ర‌మంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న ర‌కుల్‌.. ఎన్టీఆర్‌, మ‌హేష్‌, నాగ చైత‌న్య‌, రామ్ చ‌ర‌ణ్‌, గోపీచంద్‌, రామ్‌, ర‌వితేజ ఇలా పెద్ద హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ హెల్ప్..హెల్ప్.. అంటూ అర‌స్తూ ఏడుస్తోంది. ఏమైంది.. ఏదైనా ప్ర‌మాదంలో ప‌డిందా? అంటే అవును ప్ర‌మాదంలోనే ప‌డింది. కానీ, రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్ రీల్ లైఫ్‌. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ర‌కుల్ తాను న‌టిస్తున్న అటాక్ సినిమా కోసం డబ్బింగ్‏ను స్టార్ట్ చేసింది.

ఇందులో భాగంగానే డబ్బింగ్ స్టూడియోలో ఈ సీన్ కోసం ర‌కుల్‌ ఏడుస్తూ.. హెల్ప్ మీ.. హెల్ప్ మీ.. అని అరుస్తూ డ‌బ్బింగ్ చెప్పింది. అంతేకాదు, ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/CRoYLeShjCo/?utm_source=ig_web_copy_link