`అర్జున్ రెడ్డి`ని రిజెక్ట్ చేసి..ఇప్పుడు చింతిస్తున్న ప్ర‌ముఖ హీరోయిన్!

July 27, 2021 at 9:57 am

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే జంట‌గా న‌టించిన చిత్రం `అర్జున్ రెడ్డి`. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యి.. భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. అలాగే ఈ సినిమాతో విజ‌య్ ఓవ‌ర్ నైట్ స్టార్ అవ్వ‌గా.. షాలిని ఈ మూవీ త‌ర్వాత మ‌రిన్ని ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంది.

Arjun Reddy': Intense, raw and unbelievably honest - The Statesman

అయితే నిజానికి ఈ చిత్రంలో మొద‌ట మలయాళీ నటి పార్వతి నాయర్ ని అనుకున్నారట. సందీప్ రెడ్డి వంగా స్క్రిప్ట్ ఆమెకే నేరేట్ చేశాడట. కానీ, క‌థలో రొమాంటిక్ స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో.. ఆమె అర్జున్ రెడ్డిని రిజెక్ట్ చేసింద‌ట‌. ఆ త‌ర్వాత సందీప్ షాలినీని తీసుకున్నార‌ట‌.

Parvati Nair regrets missing out on Arjun Reddy | Tamil Movie News - Times of India

అయితే అప్పుడు అర్జున్ రెడ్డిని వ‌దులుకున్నందుకు పార్వ‌తి నాయ‌ర్ ఇప్పుడు చింతిస్తోంది. ఇటీవల ఓ సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్న పార్వతి నాయర్ ని ఓ నెటిజెన్ అర్జున్ రెడ్డికి నో చెప్పినందుకు ఫీల్ అవుతున్నారా? అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు ఆమె `అవును, నిజమే. అర్జున్‌రెడ్డి ఓ మంచి చిత్రం. ఆ సినిమా అవకాశం వదులుకున్నందుకు నిజంగా బాధగా ఉందని తెలిపారు.

`అర్జున్ రెడ్డి`ని రిజెక్ట్ చేసి..ఇప్పుడు చింతిస్తున్న ప్ర‌ముఖ హీరోయిన్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts