ఏంటీ..`లూసిఫర్‌` రీమేక్‌లో ఆ పాత్ర‌నే క‌ట్ చేశారా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేయ‌నున్న ప్రాజెక్ట్స్‌లో మ‌ల‌యాళ హిట్ లూసిఫ‌ర్ రీమేక్ ఒక‌టి. జయం మోహన్ రాజా ఈ రీమేక్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇటీవ‌లె పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వ‌రలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

ఇలాంటి త‌రుణంలో.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. లూసిఫర్‌ లో పృథ్వీరాజ్‌ సుకుమారన్ కీల‌క పాత్ర పోషించాడు. ఆయ‌న ఈ సినిమా డైరెక్ట‌ర్ కూడా. కానీ, చిరు హీరోగా తెర‌కెక్క‌బోయే తెలుగు రీమేక్ మాత్రం పృథ్వీరాజ్ పాత్ర‌నే క‌ట్ చేసేశార‌ట‌.

ఆయ‌న పాత్ర‌కు బ‌దులుగా హీరోయిన్‌తో కూడిన ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌తో పాటు డాన్‌గా చిరు మారిన తీరును చూపించనున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, లూసిఫర్ ఒరిజిన‌ల్‌లో హీరోయిన్ పాత్రే ఉండ‌దు. అయితే తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా మోహ‌న్ రాజా రీమేక్‌లో హీరోయిన్ రోల్‌ను యాడ్ చేసి స్క్రిప్ట్ రాసుకున్నాడ‌ట.

Share post:

Latest