మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన నిధి అగ‌ర్వాల్‌..!

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స‌వ్య‌సాచి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిధి.. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తోంది.

ఇక తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసింది నిధి. కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ సరసన న‌టించే ఛాన్స్ అందుకుంది నిధి. దర్శకుడు మగిల్ తిరుమేని ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఉదయనిధి స్టాలిన్ స్వంత ప్రొడక్షన్ అయిన రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది.

Magizh Thirumeni team up with Nidhi Agarwal and Udhayanidhi Stalin

త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. కాగా, రవి హీరోగా తెర‌కెక్కిన భూమి సినిమాతో కోలీవుడ్‌లో అడుగు పెట్టిన నిధి.. ఆ త‌ర్వాత శింబుకు జోడీగా ఈశ్వరన్ లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్ర‌మంలోనే నిధికి అక్క‌డ కూడా వ‌రుస అవ‌కాశాలు వ‌రిస్తున్నాయి.

Nidhhi Agerwal in Udhayanidhi's next!

Share post:

Popular