గెట్ రెడీ..`ఆర్ఆర్ఆర్‌` నుంచి రాబోతున్న మ‌రో బిగ్ ట్రీట్‌!

July 27, 2021 at 12:05 pm

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా.. ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా క‌నిపించ‌నున్నారు. అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆర్ఆర్ఆర్‌ సినిమా ఫ‌స్ట్ సాంగ్ ను ఆగ‌స్టు 1వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ విష‌యాన్ని ట్విట్టర్ వేదికగా పేర్కొంటూ ఒక పోస్టర్ ను వదిలారు.

`దోస్తీ..` అనే పేరుతో సాగనున్న ఈ పాటను.. హేమచంద్ర, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్‌ ఏసుదాసు, అమిత్‌ త్రివేది, యాజిన్‌ నైజర్‌ ఆలపించాన‌ట్టు తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ బ‌ట్టీ స్ప‌ష్ట‌మైంది. ఇక ఈ సాంగ్‌ను ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేయ‌బోతున్నారు. మ‌రి ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ సింగిల్ ఎలా ఉండ‌నుందో తెలియాలంటే.. ఆగ‌స్టు 1 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

 

గెట్ రెడీ..`ఆర్ఆర్ఆర్‌` నుంచి రాబోతున్న మ‌రో బిగ్ ట్రీట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts