`బాహుబలి`లో న‌య‌న‌తార ఫిక్స‌ట‌?!

బాహుబ‌లిలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించ‌డం ఫిక్స్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బాహుబ‌లిలో న‌య‌న్ న‌టించ‌డం ఏంటీ? ఆల్‌రెడీ ఆ సినిమా రెండు భాగాలుగా విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది క‌దా! అని అనుకుంటున్నారా? అయితే న‌య‌న్ న‌టించేది సినిమాలో కాదు వెబ్ సిరీస్‌లో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Before the Beginning': Netflix announces prequel to 'Baahubali' series |  The News Minute

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌రి విడుద‌ల త‌ర్వాత ఆనంద్‌ నీలకంఠన్ ద రైజ్‌ ఆఫ్‌ శివగామి పేరుతో ఓ పుస్తకం రాశారు. దాని ఆధారంగా బాహుబలి: ద బిగినింగ్ కు ముందు ఏం జరిగిందనే కథతో రూపొందుతోన్న వెబ్‌ సిరీస్‌నే ‘బాహుబలి: బిఫోర్‌ బిగినింగ్‌’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‏ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను మొత్తం తొమ్మిది భాగాలుగా నిర్మించ‌బోతోంది.

Wamiqa Gabbi Contact Address, House Address, Phone Number

దేవకట్టా, ప్రవీణ్ సత్తార్‏లు దర్శకత్వం వ‌హించ‌నున్న ఈ సిరీస్‌లో శివగామి పాత్రలో వామిక గబ్బి నటించనుంది. అలాగే మ‌రో కీల‌క పాత్ర‌లో న‌య‌న‌తార న‌టించ‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయ‌ని.. న‌య‌న్ సెప్టెంబర్‏ నుంచి షూటింగ్‌లో జాయిన్ అవ్వ‌నుంద‌ని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, ఈ సిరీస్‌ను తెలుగుతో పాటు.. తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ చేయ‌నున్నారు.