అదిరిపోయిన‌ `నార‌ప్ప‌` ట్రైల‌ర్‌..వెంకీకి మ‌రో హిట్ ఖాయ‌మేనా?

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన తాజా చిత్రం నార‌ప్ప‌. సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించింది. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జూలై 20న విడుద‌ల కానుంది.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా నార‌ప్ప ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రెండు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. కుల వ్యవస్థ, భూవివాదం వంటి సామాజిక అంశాలతో ఈ చిత్రం తెర‌కెక్కింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో వెంకటేశ్‌ యువకుడిగా, మధ్య వయస్కుడిగా క‌నిపించ‌నున్నాడ‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. అలాగే వెంకీ భార్య సుందరమ్మగా ప్రియ‌మ‌ణి క‌నిపించింది.

మన దగ్గర డబ్బు, భూమి ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఎవరూ లాగేసుకోలేరు చిన్నప్ప అంటూ చివర్లో వెంకీ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఇక యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, వెంకటేష్..ప్రియమణిల నటన, మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్, శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ ఇలా ప్ర‌తి ఒక్క‌టి పీక్స్‌లో ఉన్నాయి. మొత్తానికి ట్రైల‌ర్ చూస్తుంటే.. వెంకీ మ‌రో హిట్‌ను ఖాతాలో వేసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది.

Share post:

Latest