బ‌న్నీ నిర్ణ‌యంపై మైత్రీ అసంతృప్తి..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు.

ఎర్ర చంద‌నం స్మ‌గ్గింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. త్వ‌ర‌లోనే మొద‌టి భాగానికి సంబంధిచిన షూటింగ్ ఫినిష్ కానుంది. అయితే పుష్ప ఫ‌స్ట్ పార్ట్ పూర్తి అయిన త‌ర్వాత‌.. బ‌న్నీ వేణు శ్రీ‌రామ్ ద‌ర్వ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించ‌బోయే ఐకాన్ సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఐకాన్‌ను మూడు నెల‌ల్లో పూర్తి.. ఆ త‌ర్వాత పుష్ప 2ను స్టార్ట్ చేయాల‌ని బ‌న్నీ భావిస్తున్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. బ‌న్నీ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అసంతృప్తిగా ఉన్నార‌ట‌. పుష్ప 1 త‌ర్వాత బ‌న్నీ ఐకాన్ స్టార్ట్ చేస్తే.. పుష్ప 2 మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌ని వారు ఆస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Share post:

Latest