కేటీఆర్ బ‌ర్త్‌డే.. ఆ ప‌ని చేయాలంటూ చిరు విన్న‌పం!

July 24, 2021 at 7:39 am

సీఎం కేసీఆర్ త‌న‌యుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ‌ర్త్‌డే నేడు. ఈ సందర్భంగా అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, సెల‌బ్రెటీలు ఆయ‌నకు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

అలాగే ఓ ప‌ని కూడా చేయాలంటూ కేటీఆర్‌కు విన్న‌పం చేశారు. `కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సందర్భంగానే కాకుండా ప్రతీ సందర్భంలోనూ మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. త‌ద్వారా రోజురోజుకూ పెరిగిపోతున్న గ్లోబల్‌ వార్మింగ్‌కు చెక్ పెట్టొచ్చు.

మనం ప్రకృతిని రక్షిస్తే.. అది మన్నలి ర‌క్షిస్తుంది. ఎంపీ సంతోష్‌ కుమార్‌కు కృతజ్ఞతలు` అంటూ చిరు ట్వీట్ చేశారు. మ‌రి చిరు ట్వీట్‌కు కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కాగా, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగానూ ఓ యజ్ఞంలా దూసుకుపోతోంది. స్టార్ సెల‌బ్రెటీలు సైతం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే.

కేటీఆర్ బ‌ర్త్‌డే.. ఆ ప‌ని చేయాలంటూ చిరు విన్న‌పం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts