అదిరిపోయిన‌ మ‌మ్ముటి `వ‌న్` ట్రైల‌ర్‌!

మల‌యళ సూప‌ర్‌ స్టార్ మమ్ముట్టి న‌టించిన తాజా చిత్రం `వ‌న్‌`. సంతోష్ విశ్వాన్థ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఇచాయిస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్ శ్రీలక్ష్మి నిర్మించారు. పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌మ్ముట్టి సీఎంగా క‌నిపిస్తారు. ఈ ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి డ‌బ్ చేసి.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 30న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే వ‌న్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలని కలలుకనే ఓ ముఖ్యమంత్రి అవినీతి పరులైన మంత్రులను, శాసన సభ్యులను ఏరివేయాల‌ని భావిస్తాడు.

అయితే అవినీతిలో కూరుకుపోయిన ఈ సమాజంలో ఆ ముఖ్యమంత్రి ఆశయాలు నెరవేరాయా? లేదా? అన్నదే ఈ సినిమా క‌థ అని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్‌.. సినిమా మంచి అంచ‌నాలు క్రియేట్ చేసింది. మ‌రి పూర్తి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే.. జూలై 30 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular