విజ‌య్ ద‌ళ‌ప‌తికి హైకోర్ట్ బిగ్ షాక్‌..రూ.ల‌క్ష జ‌రిమానా!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌నకు త‌మిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా విజ‌య్‌కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లక్ష రూపాయాల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‏కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది.

ఇంత‌కీ విజ‌య్‌కి జ‌రిమానా ఎందుకు పడిందంటే.. విజ‌య్‌కు కార్ల‌పై మ‌క్కువ ఎక్కువ. ఆ నేప‌థ్యంలోనే రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ అనే రూ.8 కోట్ల ఖరీదైన కారును 2012లో ఇంగ్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారుకు దాదాపు రూ.1.6 కోట్లను పన్నుగా చెల్లించాల్సి ఉంది. అయితే ఇటీవ‌ల ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ విజయ్‌ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

దీనిని విచారిన హైకోర్టు..విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే పన్నును ఇంత వ‌ర‌కు కట్టనందుకు రూ. లక్ష జరిమానా విధించ‌డంతో పాటుగా కారు ఖరీదులో ఇరవై శాతాన్ని రెండు వారాల లోపు పన్నుగా చెల్లించాలని తీర్పునిచ్చింది.

Share post:

Latest