సూప‌ర్ థ్రిల్లింగ్‌గా `కుడి ఎడమైతే` ట్రైలర్!

అమ‌లా పాల్‌, రాహుల్ విజయ్ ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన తాజా వెబ్ సిరీస్ `కుడి ఎడ‌మైతే`. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు.

ఈ సిరీస్ లో అమ‌లా పాల్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా, రాహుల్ విజ‌య్ డెలివరీ బాయ్ గా క‌నిపించ‌నున్నారు. ఈ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 16న విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కుడి ఎడ‌మైతే ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

`ఇది కల అంటే నేనే నమ్మలేకపొతున్నాను.. కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్ గా అదే జరుగుతోంది` అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన ఈ టీజ‌ర్ సూప‌ర్ థ్రిల్లింగ్‌గా కొన‌సాగింది. అనేక‌ ట్విస్టుల‌తో ఆధ్యంతం ఆకట్టుకున్న ఈ ట్రైల‌ర్ సిరీస్‌పై భారీ హైప్ క్రియేట్ చేసింది. మ‌రి ఈ ట్రైల‌ర్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

Share post:

Latest