నెట్‌ప్లిక్స్‌లో వంట‌ల‌క్క‌..త్వ‌ర‌లోనే `కార్తీక దీపం`కు శుభం కార్డు?!

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియ‌ల్స్‌లో మొద‌ట ఉండేది కార్తీక దీప‌మే. ప్రతి రోజు రాత్రి 7:30 గంటలు అయిందంటే చాలు.. ఈ సీరియ‌న్‌ను చూసేందుకు ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా అంద‌రూ టీవీలకు అతుక్కుని పోతుంటారు. అంత‌లా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకుంది కార్తీక దీపం.

బుల్లితెర చరిత్రలో ఈ సీరియ‌ల్ కనీవినీ ఎరుగని రేటింగ్స్ సాధించ‌డానికి ముఖ్య కార‌ణం వంట‌ల‌క్క అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ సీరియ‌ల్‌కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. కార్తీకదీపం సీరియల్ త్వరలోనే ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతుందట.

వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం..త్వరలోనే ఈ సీరియల్‌కు శుభం కార్డ్ పడబోతుందని, అనంత‌రం గ‌త ఐదేళ్ల‌ సీరియల్ సినిమాలా నెట్‌ఫ్లిక్స్‌లో ప్ర‌సారం కానుంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Popular