రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషిస్తున్నారు.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ తొంబై శాతం రామోజీ ఫిలిం సిటీలో పూర్తి చేయనున్నారట. రామోజీ ఫిలిం సిటీలో తన కథకు పూర్తి స్థాయి వసతులు ఉన్నాయని, ఇక మిగిలిన పది శాతం షూటింగ్ మాత్రమే బయట ప్రదేశాల్లో చేసేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఫిక్స్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది.