గరుడ పురాణం: ఈ పనులు చేస్తే జీవితంలో సంతోషంగా ఉంటారు..?

గరుడ పురాణం

గరుడ పురాణం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణ పారాయణం చేస్తుంటారు. ఈ పురాణం ద్వారానే మనిషి మరణించినా తానూ చేసిన పనుల వల్ల స్వర్గం, నరకంకి వెళ్లే దారులను నిర్ధారిస్తోంది. చనిపోయిన తర్వాత ఆనందాన్ని, బాధను పొందుతాడనే విషయాలను కూడా గరుడ పురాణమే తెలియజేస్తుంది. అందుకే ఈ పురాణాన్ని చదివిన, విన్న వాళ్లు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని అనుకుంటారు.

 

అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన తప్పులు, కర్మను సరిదిద్దుకునే మార్గాన్ని చూపిస్తుంది. జీవన విధానాలు, నియమాలు ఈ పురాణంలో స్పష్టంగా వివరించారు. దీన్ని పారాయణం చేసిన వారు తన కష్టాలన్నింటినీ అధిగమించగలడని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే గరుడ పురాణంలో చెప్పిన కొన్ని విషయాలు పాటిస్తే జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు. తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాంటి కొన్ని విషయాలను ఈ రోజు తెలుసుకుందాం.

 

గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి తన జీవితాన్ని మెరుగుపర్చుకోవాలని అనుకుంటే ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనది. ఈ ఉపవాసం పూర్తి భక్తి శ్రద్ధలతో చేస్తే కచ్చితంగా ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏకాదశి ఉపవాసాలు పాటిస్తే అన్ని కష్టాలు తొలగి సంతోషంగా ఉంటాడు. జీవితంలో కోల్పోయిన అన్ని ఆనందాలను పొందుతాడని గరుడ పురాణం చెబుతోంది.

 

అలాగే మురికి బట్టలు ధరించే వారికి అదృష్టం నాశనం అవుతుంది. అలాంటి వారి దగ్గరికి లక్ష్మీదేవి కటాక్షించదని గరుడ పురాణం చెబుతోంది. ఎల్లప్పుడూ పేదరికంలోనే బతకుతారు. అందుకే శుభ్రమైన బట్టలు, శుచి శుభ్రతను పాటిస్తుండాలని గురుడ పురాణం చెబుతోంది.

 

అలాగే శత్రువులు మనకు నిరంతరం హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అప్పుడు శత్రువుతో కూడా అప్రమత్తంగా ఉండాలి. శత్రువు దగ్గర తెలివిగా పని చేయకపోతే కచ్చితంగా నష్టపోతారని గరుడ పురాణం చెబుతోంది. శత్రువుల పెరుగుదలను బట్టి విధి విధానాలను మార్చుకోవాలని గరుడ పురాణం చెబుతోంది.

 

ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవాలి. తులసి మొక్క ఇంట్లో ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు పరిగడపున తులసి ఆకులు తింటే అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతామని గురుడ పురాణం చెబుతోంది. దేవుడి ప్రసాదంగా తులసిని తీసుకోవడం వల్ల శారీరక, మానసిక సమస్యలు తొలుగుతాయి.

 

దేవతలను, పర మతాన్ని దూషించిన వాళ్లు జీవితంలో ఎప్పటికి పైకి రాలేరు. గరుడ పురాణం ప్రకారం.. అలాంటి వారు నరకానికి వెళ్తాడు. మంచి వ్యక్తులను మోసం చేసిన వాళ్లు, స్వలాభం కోసం పక్కవాళ్లను వినియోగించుకోవడం, మంచి వ్యక్తులను మోసం చేసే వారు ఎన్నో ఇబ్బందులు పడతారు. అందుకే వీటికి దూరంగా ఉండాలని గరుణ పురాణం చెబుతోంది.