ఆ సినిమాలో సీత పాత్రకు 12కోట్లు…?

పాన్ ఇండియా అల్లు `రామాయణం 3డి` ఇప్పుడు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇందులో హృతిక్ రోషన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. టాలీవుడ్ హీరో ప్రభాస్ కూడా న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొనే రామాయణం చిత్రంలో సీత పాత్రకు సంప్ర‌దిస్తే ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసింద‌ని ప్ర‌చారం సాగుతోంది.

దాంతో కరీనా కపూర్ ను సంప్రదిస్తే రూ.12 కోట్లు అడిగిందని స‌మాచారం. అయితే అంత పెద్ద పారితోషికం డిమాండ్ చేయడం సరైనదేనా? అంటే.. ఆ సినిమాలో కరీనా తన విలువ ఎంతో చెప్పారని, తప్పేమి ఉంది? అని బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలిపింది.తాప్సీ, ప్రియమణి కూడా కరీనాను మ‌ద్ద‌తు తెలిపారు. అది ఆమె మార్కెట్ విలువ‌. అంత అడగడానికి ఆమె ఖ‌చ్ఛితంగా అర్హురాలే అని క‌రాఖండీగా చెప్పారు. కరీనా ఈ సినిమా కోసం దాదాపు రూ. 6-8 కోట్లు డిమాండ్ చేసేది. కానీ తన పారితోషికాన్ని ఏకంగా రూ.12 కోట్లకు పెంచే స‌రికి నిర్మాత‌లు త‌ట్టుకోలేక‌పోతున్నారు.

Share post:

Latest