బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జ‌గ‌న్‌..వీడియో వైర‌ల్‌!

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ప్రజా సంబంధ విషయాలతో తలమునకలుగా ఉంటారు. అటువంటి ఆయ‌న‌ తాజాగా బ్యాట్ ప‌ట్టి ఎంతో ఉల్లాసంగా క్రికెట్ ఆడారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కడప జిల్లా పర్యటనలో భాగంగా తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సందర్శించారు.స్టేడియంలో అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం సరదాగా స్టేడియంలో క్రికెట్‌ ఆడారు.

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బౌలింగ్‌ వేయగా.. సీఎం జగన్‌ బ్యాటింగ్ చేసి ఆక‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో జ‌గ‌న్ అభిమానులు తెగ అల‌రిస్తోంది. ఇక ఈ వీడియో చూస్తుంటే.. జ‌గ‌న్‌కు క్రికెట్‌లో మంచి ప‌ట్టు ఉన్న‌ట్టే అనిపిస్తోంది.

Share post:

Latest