మోక్షజ్ఞ ఎంట్రీపై బాల‌య్య‌ ఫుల్ క్లారిటీ..నిరాశ‌లో అభిమానులు!

బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా టాలీవుడ్‌లోకి అడుగు పెడ‌తాడా అని నంద‌మూరి అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అప్పుడూ, ఇప్పుడూ అంటున్నారు త‌ప్పా.. మోక్ష‌జ్ఞ ఎంట్రీ మాత్రం జ‌ర‌గ‌లేదు. ఇటీవ‌ల బాల‌య్య ఓ ఇంట‌ర్వ్యూలో `ఆదిత్య 369` మూవీ సీక్వెల్‌‌తో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

- Advertisement -

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. అయితే తాజాగా త‌న‌యుడి ఎంట్రీ గురించి బాల‌య్య ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పిన బాలకృష్ణ.. ఈ మూవీకి `ఆదిత్య 999 మాక్స్` అనే టైటిల్‌ను ఖరారు చేసిన‌ట్టు కూడా పేర్కొన్నారు. అలాగే ఇంకా డైరెక్టర్‌ను ఫైనల్ చేయలేదన్న బాలయ్య… తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేద‌ని తెలిపారు.

ఇక ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని బాల‌య్య స్ప‌ష్టం చేశారు. అయితే బాల‌య్య వ్యాఖ్య‌ల‌తో.. నంద‌మూరి ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. ఇంకా రెండేళ్ల పాటు మోక్షు ఎంట్రీ కోసం వెయిట్ చేయాలా? అంటూ ఆస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

Share post:

Popular