ఎయిర్ హోస్ట్ గా మారుతున్న టాలీవుడ్ టాప్ యాంకర్!

July 31, 2021 at 8:08 am

బుల్లితెరపై హాట్ యాంక‌ర్‌గా త‌నకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అన‌సూయ‌.. వెండితెర‌పై కూడా స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ రంగ‌మ్మ‌త్త యంగ్ హీరోల చిత్రాల్లోనే కాకుండా.. స్టార్ హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్ర‌లు పోషిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బ్యూటీ ఎయిర్ హోస్టెస్‌గా మారేందుకు సిద్ధ‌మ‌వుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. `పేపర్ బాయ్` సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన జయశంకర్‌.. తాజాగా ఓ స‌రికొత్త క‌థ రెడీ చేశాడు. ఇందులో ఆరు ప్ర‌ధాన‌మైన పాత్ర‌లు ఉంటాయ‌ట‌. అయితే వాటిలో ఎయిర్ హోస్టెస్ పాత్ర కూడా ఉంటుంది.. ఆ రోల్‌లో అన‌సూయ న‌టించ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ యాబై శాతం పూర్తి అయింద‌ని.. వ‌చ్చే నెల‌లో అన‌సూయ కూడా షూట్‌లో జాయిన్ కానుంద‌ని తెలుస్తోంది. త్వ‌రలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయి.

 

ఎయిర్ హోస్ట్ గా మారుతున్న టాలీవుడ్ టాప్ యాంకర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts