తల కిందులుగా అల్లు స్నేహా యోగాసనం..బ‌న్నీ ఫ్యాన్స్ ఫిదా!

అల్లు వారి కోడ‌లు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల్లో న‌టించ‌క‌పోయినా.. సోష‌ల్ మీడియా ద్వారా హీరోయిన్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న స్నేహా.. ఎప్ప‌టిక‌ప్పుడు తమదైన శైలిలో అభిమానులను ఆక‌ట్టుకుంటుంది.

ఇక ఇప్పుడు ఈమె తనలోని కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేసింది. చాలా రోజుల నుంచి యోగాలో శిక్షణ తీసుకుంటున్న స్నేహారెడ్డి.. తాజాగా తాడు సహాయంతో తల కిందులుగా మారి యోగాసనం వేసింది.

అంతేకాదు, ఇందుకు సంబంధించిన ఫొటోను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేయ‌గా.. ఆమె అభిమానులు మ‌రియు బ‌న్నీ అభిమానులు స్నేహా యోగాస‌నానికి ఫిదా అవుతున్నారు. దాంతో స్నేహా మ‌రోసారి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఈ మధ్యే స్నేహా ఇన్ స్టాలో నాలుగు మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకుని అరుదైన ఘ‌నత సాధించిన సంగ‌తి తెలిసిందే.

https://www.instagram.com/p/CRETObsDxtc/?utm_source=ig_web_copy_link