భారీ ప్రాజెక్ట్ కి ఓకే అంటున్న అల్లు అర్జున్.?

July 1, 2021 at 3:09 pm

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పాన్ ఇండియన్ లెవెల్ లోనే హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఆయ‌న ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ రాష్ట‌రాల ఆడియెన్స్ సహా ఇతర దక్షిణాది భాష‌ల్లో కూడా బన్నీ మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకుంటున్నాడు. వారికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు తన లేటెస్ట్ అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయిన పుష్ప మూవీతో రెడీ అవుతున్నాడు.

ఇక ఈ మూవీ తర్వాత నుంచి కూడా అన్నీ పాన్ ఇండియన్ లెవెల్లోనే సినిమాలు తీయాల‌నే బజ్ కూడా విన‌ప‌డు తోంది. కాగా బన్నీ లైనప్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. కోలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత ఎస్ థాను బ్యానర్ లో బన్నీ ఓ మూవీ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్పటి దాకా వారి బ్యానర్ లో తుపాకితో పాటే అసురన్ తేరి లాంటి భారీ హిట్ సినిమాలు వ‌చ్చాయి. కాబ‌ట్టి వారికే బన్నీ సైన్ చేసినట్టు స‌మాచారం. ఈ మూవీ కూడా ఓ స్టార్ తమిళ్ డైరెక్ట‌ర్ తోనే ఉంటుందని తెలుస్తోంది.

భారీ ప్రాజెక్ట్ కి ఓకే అంటున్న అల్లు అర్జున్.?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts