టిటిడి సంచలన నిర్ణయం..!

టీటీడీ దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి త‌న వ‌ద్ద ఉండే ఉద్యోగుల‌కు షాక్ న్యూస్ చెప్పింది. ఈ క‌రోనా స‌మ‌యంలో ఎక్కువ మంది ఉద్యోగులు వైర‌స్ కు పాజిటివ్ తెచ్చుకున్నారు. కాగా కొంత‌మంది ఉద్యోగులు క‌రోనాతో మ‌ర‌ణించారు. కాగా ఉద్యోగుల ఆరోగ్య‌భ‌ద్ర‌త విష‌యంలో టీటీడీ రీసెంట్ గా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీలో ప‌ని చేస్తున్న 45 ఏళ్లు పైబ‌డి జాబ‌ర్ల‌కు వ్యాక్సిన్ తీసుకోక‌పోతే వారికి జీతం ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇక ఉద్యోగుల కోసం టీటీడీ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ చేప‌ట్టిన‌ప్ప‌టికీ చాలా మంది ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకోవ‌ట్లేదు. దీంతో వ్యాక్సిన్‌పై కఠిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని టీటీడీ పాల‌క‌మండ‌లి భావించింది. అందుకోస‌మే వ్యాక్సిన్ వేయించుకోని వారికి జూన్ జీతం నిలిపివేయాల‌ని ఆర్డ‌ర్లు ఇచ్చింది. ఇక జులై 7వ తేదీలోగా 45 ఏళ్లుపైబ‌డి వారంద‌రికీ వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రిగా వేయించుకోవాల‌ని టీటీడీ తెలిపింది. ఆ లోపు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి వెంట‌నే జీతం చెల్లించాల‌ని లేక‌పోతే వారి జీతాలు ఆపేయాల‌ని తెలిపింది.