ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్న డోంట్ బ్రీత్‌-2 ట్రైల‌ర్‌

July 1, 2021 at 3:48 pm

టాలీవుడ్‌లో హార‌ర్ మూవీస్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు కూడా హారర్ మూవీ డోంట్ బ్రీత్ కు సీక్వెల్ గా తీసిన డోంట్ బ్రీత్-2 ట్రైలర్ ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సీక్వెల్ ను స్క్రీన్ జెమ్స్, స్టేజ్ 6 ఫిల్మ్స్, గోస్ట్ హౌస్ పిక్చర్స్, గుడ్ యూనివర్స్ క‌లిసి వారి స‌మ‌క్షంలో నిర్మించాయి. కాగా రోడో సయాగుస్ దీనికి డైరెక్ష‌న్ వహించారు. అయితే రీసెంట్‌గా విడుదలైన డోంట్ బ్రీత్-2 మూవీ ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది.

ఈ మూవీలో ఒక అనాథ అమ్మాయిని పెంచుకునే వ్య‌క్తిగా స్టీఫెన్ లాంగ్ ఉంటాడు. కాగా కొంతమంది నేరస్థులు వారి ఇంట్లోకి చొరబడి ఆమెను కిడ్నాప్ చేయ‌డం క‌నిపిస్తోంది. ఈ ట్రైలర్ ఆద్యంతం అంద‌రినీ ఆకట్టుకుంటోందని తెలుస్తోంది. ఆ అమ్మాయిని అంధుడైన స్టీఫెన్ ఎలా కాపాడుతాడు అనే ఆసక్తిని ట్రైల‌ర్ కలిగిస్తోంది. 2016లో విడుదలైన డోంట్ బ్రీత్ మూవీలో స్టీఫెన్ లాంగ్ అంధుడిగా నటించి మెప్పించార‌నే చెప్పాలి. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ద‌గ్గ‌ర‌ ఘన విజయం సాధించింది.

ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్న డోంట్ బ్రీత్‌-2 ట్రైల‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts